అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేశారు. లేపాక్షి మండల కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
మొత్తం పదిమంది..
ముగ్గురు నిర్వాహకులతో పాటు బెట్టింగ్‌కి పాల్పడిన ఏడుగురు నిందితులతో కలిపి మొత్తం పదిమందిని అరెస్ట్ చేశారు. అనంతరం రూ. 44 వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్ భాషా తెలిపారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. యువత బెట్టింగ్‌లకు పాల్పడితే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.
ఇవీ చూడండి :
రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు!