కర్నూలు - అనంతపురం జిల్లాల సరిహద్దు గ్రామాలలోని పేకాట స్థావరాలపై అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3,07,500 నగదు, మూడు ద్విచక్రవాహనాలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉరవకొండ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.
పేకాట శిబిరాలపై పోలీసుల దాడి... ఎనిమిది మంది అరెస్టు - playing cards
కర్నూలు - అనంతపురం జిల్లాల సరిహద్దులోని పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఉరవకొండ సీఐ తెలిపారు.
పేకాట శిబిరాలపై పోలీసుల దాడి... ఎనిమిది మంది జూదరుల అరెస్టు