అనంతపురంలోని జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో క్రీడలు, ఈవినింగ్ వాక్ కోసం పెద్దసంఖ్యలో జనం వచ్చారు. ఎవరూ సామాజిక దూరం పాటించ లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారి ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్‌పై ఎక్కించిస్టేషన్కు తరలించారు. నిబంధనలు అతిక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ భవ్యకిషోర్ హెచ్చరించారు.
క్రీడలు పేరుతో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన.. స్టేషన్‌కి వాహనాల తరలింపు - A large number of people in the name of sports in government degree colleges
కొవిడ్ నిబంధనలు అతిక్రమించి గుంపులుగా తిరుగుతున్న వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలు, ఈవినింగ్ వాక్ పేరుతో బయట తిరుగుతున్న వ్యక్తులను హెచ్చరించి వారి వాహనాలను స్టేషన్‌కి తరలించారు.
క్రీడలు పేరుతో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన