రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో నిరనస చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్థానికులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చెవిలో పూలు పెట్టుకొని కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు చేసుకోబోమని చెప్పారు. ఆలోచన మారకపోతే నిరశన దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
చెవిలో పువ్వు పెట్టుకొని... నిరసన దీక్ష - latest news on amaravathi
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో... అమరావతి పరిరక్షణ సమితి బాధ్యులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
![చెవిలో పువ్వు పెట్టుకొని... నిరసన దీక్ష parirakshana-samithi-vinutna-nirasana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5551066-769-5551066-1577799911093.jpg)
అనంతపురంలో అమరావతి కోసం నిరసనలు