రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతుల శిబిరాలను సందర్శించిన పవన్ ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరారు. ఆ సమయంలో సచివాలయంలో ఉన్న సీఎం జగన్ ఇంటికి వెళ్లే వరకూ ఆ మార్గంలో అనుమతించడం కుదరదని పోలీసులు అడ్డుకున్నారు.
కృష్ణాయపాలెం నుంచి నేరుగా తుళ్లూరు వెళ్లాలని జనసేనానికి సూచించారు. అయితే మందడం రైతులు తమ గ్రామానికి రావాల్సిందేనని పట్టుబట్టారు. వారి విజ్ఞప్తిని మన్నించిన పవన్ మందడం బయల్దేరగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టంగా చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పవన్ కారు దిగి నడుచుకుంటూ వెంకటపాలెం చెక్ పోస్టు వరకూ వెళ్లారు.
రోడ్డుపై బైఠాయించిన జనసేనాని
చెదరగొట్టిన పోలీసులు
ఇదీ చదవండి : ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!