ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే ప్రాణాలు పోయాయి

తన భర్తకు ఊపిరాడట్లేదని.. ఓ మహిళ.. గర్భిణీ అయిన తన కూతురుతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి డాక్టర్లు మాత్రం వారిని పట్టించుకోకుండా బయటకు గెంటేశారు. తెల్లవార్లు వారు ఆసుపత్రి బయట చికిత్స కోసం ఎదురు చూసినా వైద్యులు మాత్రం వారిని కనికరించ లేదు. ఫలితంగా తన ఒడిలో.. భర్త ప్రాణాలు వదిలాడు. తను చనిపోయిన తర్వాత.. రోడ్డుమీదే 9 గంటలున్నా ఎవరు స్పందించలేదు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

One person died due to negligence of a government hospital  in anantapur district
ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే భర్త ప్రాణాలు పోయాయి.

By

Published : Jul 24, 2020, 10:26 AM IST

Updated : Jul 24, 2020, 11:25 AM IST

ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే భర్త ప్రాణాలు పోయాయి.

ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాణాలు నిలబెడతాయనుకుంటే..ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్నాయి. కొన్ని చోట్ల సౌకర్యాలు లేక రోగులు చనిపోతుంటే..మరోచోట కళ్లముందే ప్రాణాలు వదులుతున్న కనికరించే నాథుడే లేకుండా పోయారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం దొరుకుతుందని ఆశగా వెళ్తే..వారి కళ్లముందే అయిన వాళ్ల ప్రాణాలు పోతున్నాయి.

ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోనే రోడ్డు మీద నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ధర్మవరానికి చెందిన రాజా ఈరోజు తెల్లవారుజామున ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతని భార్య, గర్భిణి అయిన అతని కూతురు నిస్సహాయ స్థితిలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వైద్యులు ఎవరు కనీసం వార్డులోకి కూడా రానివ్వకపోవడంతో.. వారు రోడ్డుమీద ఉన్నారు. తన భర్తకు ఊపిరాడక అల్లాడిపోతున్నాడని వైద్యుల్ని ఎంత ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు అతను భార్య ఒడిలోనే ప్రాణాలు ఒదిలాడు.

  • వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం...

కళ్లముందే భర్త చనిపోవడంతో బాధితురాలు ఆమె కన్నీరుమున్నీరైంది. మృతుడి కుమార్తె.. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడింది. తమని కుక్కల్లా చూశారని కనీసం మనుషులమన్న సంగతి కూడా మరిచిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాజా చనిపోయిన రోడ్డుమీద తొమ్మిది గంటల వరకు ఉన్న ఎవరు స్పందించక పోవడం మరింత దారుణం. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి సంఘటనలు జరిగినా ..అక్కడ పరిస్థితి ఏమాత్రం మారడం లేదు.

ఇదీ చూడండి.ఆసుపత్రుల్లో చేర్చుకోండయ్యా!

Last Updated : Jul 24, 2020, 11:25 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details