అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం రమనేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై రాయదుర్గం వైపు వెళ్తున్నారు. రామనేపల్లి గేట్ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య, కుమారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రమనేపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి - రాయదుర్గం
బెలుగుప్ప మండలం రమనేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రమనేపల్లి రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి