పురాతన సంస్కృతిని, ఆర్థిక, ఆధ్యాత్మిక, మత ఆచార వ్యవహారాలను భావితరాలకు చూపే దర్పణాలు నాణేలు, నోట్లు. అటువంటి పురాతన నాణేలు, నోట్ల గురించి నేటి తరం వారికి తెలియజేసేందుకు రాయలసీమ పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన సంఘం ఆధ్వర్యంలో... అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాసవి విద్యానికేతన్ పాఠశాలలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు 250 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులకు, పట్టణ ప్రజలకు వాటి గురించి వివరించారు.
ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన..! - అనంతపురం జిల్లాలో ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన
పురాతన నాణేలు, నోట్లు నాటి పాలకుల పరిపాలనకు సాక్ష్యాలు. అటువంటి పురాతన నాణేలు, నోట్ల గురించి నేటి తరానికి తెలియజేసేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లాలో ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన
TAGGED:
పురాతన నాణేల ప్రదర్శన