విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగిన విశాఖ ఉత్సవ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయకుడు అనుదీప్ గంట పాటు నాన్ స్టాప్ పాటలతో అలరించాడు. అనంతరం ప్రభుత్వ పథకాలతో కూడిన ప్రొజెక్షన్ అందరినీ అలరించింది. వికాస్ టీం అద్భుత విన్యాసాలు, నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. లక్ష్మీ మానస్ బృందం చేసిన శాస్త్రీయ నృత్యాలు, రాజస్థాని బృందం చేసిన సంగీత సంప్రదాయ నృత్యాలు విశాఖ ఉత్సవ్‌కు కొత్త శోభను తెచ్చాయి. ప్రముఖ సంగీత దర్శకులు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన పాటలతో సందడి చేశారు. గాయనీ, గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి, నవీన తమ గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు.
ఇదీ చూడండి: