ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు - కోతకు గురైన హంద్రీనీవా ప్రధాన

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం సమీపంలో ఉన్న హంద్రీనీవా ప్రధాన కాల్వ కోతకు గురైంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ యంత్రాంగాన్ని కదిలించారు. యుద్ధ ప్రాతిపదికన యంత్రాలను తెప్పించి నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు
తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు

By

Published : Oct 15, 2020, 6:07 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం సమీపంలో ఉన్న హంద్రీనీవా ప్రధాన కాల్వ కోతకు గురైంది. ఈ విషయమై ఈటీవీ, ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనం మేరకు యంత్రాంగం పనులు ప్రారంభించింది.

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు

అప్రమత్తం..

విషయం తెలుసుకున్న వెంటనే.... తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హంద్రీనీవా అధికారులను అప్రమత్తం చేశారు. బుధవారం సాయంత్రం అధికారులు యుద్ధ ప్రాతిపదికన యంత్రాలను తెప్పించి నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు

కోతకు గురవుతూనే ఉంది..

కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువ అవుతుండటం వల్ల కొద్ది కొద్దిగా మట్టి పెళ్లలు విరిగి మరింత కోతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు పంప్ హౌస్ వద్ద మోటర్లు ఆఫ్ చేసి నీటిని తగ్గించి కోతకు గురైన చోట మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు

రాళ్లను తొలగిస్తే..

అక్కడ గట్టుకు అడ్డంగా ఉన్న రాళ్లను యంత్రాల ద్వారా తొలగిస్తుండటంతో ప్రవాహం మాత్రమే కాస్త తగ్గుతుందన్నారు. మళ్లీ భారీ వర్షాలు వస్తే ఇప్పుడు ఉన్న కాస్త గట్టు కూడా తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో కదిలిన అధికారులు

ఇవీ చూడండి:

మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details