ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేసీ కుటుంబానికి చెందిన త్రిశూల్‌ సిమెంట్స్‌ ఆస్తుల జప్తునకు నోటీసులు - former mp jc diwakar reddy news

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన త్రిశూల్‌ సిమెంట్స్‌ యాజమాన్యానికి గనుల శాఖ అధికారులు ఆస్తుల జప్తు నోటీసులు జారీ చేశారు.

Jc diwakar reddy
జేసీ కుటుంబానికి చెందినత్రిశూల్‌ సిమెంట్స్‌ ఆస్తుల జప్తునకు నోటీసులు

By

Published : Dec 2, 2020, 9:18 AM IST

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబసభ్యులకు చెందిన త్రిశూల్‌ సిమెంట్స్‌ యాజమాన్యానికి గనుల శాఖ అధికారులు ఆస్తుల జప్తు నోటీసులు జారీ చేశారు. గత ఆగస్టులోనే తాఖీదులు ఇవ్వగా తాజాగా వెలుగులోకి వచ్చింది. గనులశాఖ అధికారుల వివరాల మేరకు... అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు మజరా సర్వే నెం.22బిలో 13 లక్షల టన్నుల లైమ్‌స్టోన్‌ అక్రమ రవాణాతో పాటు మరో 1.21 లక్షల టన్నులకు సంబంధించి త్రిశూల్‌ సిమెంట్స్‌ యాజమాన్యం అనుమతి పత్రాలు దుర్వినియోగం చేసింది. అందుకు రూ.100 కోట్లు అపరాధ రుసుం చెల్లించాలంటూ ఈ ఏడాది మే 7న యాజమాన్యానికి అధికారులు డిమాండ్‌ నోటీసు పంపించారు. ఆ కంపెనీనుంచి సమాధానం రాకపోవడంతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలంటూ అనంతపురం గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆగస్టు 20న యాడికి తహసీల్దార్‌కు ఓ లేఖ రాశారు.

త్రిశూల్‌ యాజమాన్యానికి చెందిన రూ.100 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అయితే యాడికి మండలంలో త్రిశూల్‌ యాజమాన్యానికి ఆస్తులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. త్రిశూల్‌ సిమెంట్స్‌లో డైరెక్టర్లుగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి(70 శాతం), కోడలు సంయుక్తారెడ్డి(20 శాతం) వాటాదారులు కాగా వేణుగోపాల్‌రెడ్డికి 5 శాతం, హుసేన్‌బాషా, నాగసుబ్బారాయుడు, సిలాస్‌, గోపాల్‌, దేవపుత్ర అనే వ్యక్తులకు ఒక్కో శాతం వాటా ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details