ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పట్టణంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పొగాకు నివారణ గురించి చైతన్యం తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు.
'హిందూపురంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ'
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చైతన్య ర్యాలీ నిర్వహించారు.
'పొగాకు నివారణ పై ప్రభుత్వ వైద్య సిబ్బంది చైతన్య ర్యాలీ'