ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ రక్తనిధి ఏర్పాటు వంటి హామీలను వెంటనే అమలు చేయాలంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో స్వచ్చంద సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు కూడలి నుంచి గాంధీ కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. సీఎం గతంలో తన పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, అది నెరవేర్చాలని గుర్తుచేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం పెట్టారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క చాలా మంది మరణిస్తున్నారని ఆవేదన చెందారు.
ప్రభుత్వ రక్తనిధి ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థల జేఏసీ ర్యాలీ - ప్రభుత్వ రక్తనిధి ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థల జెఎసి ర్యాలీ
ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ రక్తనిధి ఏర్పాటు వంటి హామీలను వెంటనే అమలు చేయాలంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో స్వచ్చంద సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
ప్రభుత్వ రక్తనిధి ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థల జెఎసి ర్యాలీ
ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం చేపట్టామని అక్టోబర్ 1లోగా ప్రభుత్వం బ్లడ్ బ్యాంక్ పై స్పష్టమైన లిఖిత పూర్వక హామీ ఇవ్వకపోతే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ సాధనకోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని స్వచ్ఛంద సంస్థల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇవీ చదవండి: నిండు గర్భిణి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబీకులు