ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ కేసులన్నింటికీ జగన్ వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తారు'

తెదేపా కార్యకర్తలెవరూ అక్రమ కేసులకు భయపడరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అక్రమ కేసులన్నింటికీ జగన్‌ వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తారని పేర్కొన్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/15-June-2020/7620687_696_7620687_1592203714697.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/15-June-2020/7620687_696_7620687_1592203714697.png

By

Published : Jun 15, 2020, 12:20 PM IST

Updated : Jun 15, 2020, 12:35 PM IST

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టు అయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి తరహా రాజ్యాంగం నడుపుతున్నారన్నారు. ఈ పరిణామాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ అన్నారు.

'ఎప్పటి నుంచో ట్రావెల్స్ రంగంలో ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపు ధొరణితో వెళ్తున్నారు. మా కార్యకర్తలకు, నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. అక్రమాలు చేశారు కాబట్టి జగన్ 16నెలలు జైలులో ఉన్నారు. ఆయనలానే అందరూ జైలుకు వెళ్లాలని జగన్ కోరుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా తప్పుదోవపట్టిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. బడుగు బలహీన వర్గాలపై దాడులు, కేసులు పెరిగాయి. ప్రస్తుతం తమకేం కాలేదని ప్రజలు ఊరుకుంటే.. రేపు వారిపై కూడా పడుతారు.' అని లోకేశ్ హెచ్చరించారు.

  • ఫైబర్ గ్రిడ్​పై అవగాహన లేదు

ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతి జరిగిందంటున్న మంత్రులకు కనీస అవగాహన లేదు. ఫైబర్‌ గ్రిడ్‌ ఐటీ మంత్రి పరిధిలోకే రాదు. దస్త్రాలు నా వద్దకు కూడా రాలేదు. అవినీతి జరిగినట్లు ఆధారాలు చూపించలేకపోయారు.

-నారా లోకేశ్

ఇదీ చదవండి: జేసీ ప్రభాకర్​రెడ్డి కుటుంబ సభ్యులకు లోకేశ్ పరామర్శ

Last Updated : Jun 15, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details