Lokesh on old woman pension cut: ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజునే.. దివ్యాంగురాలైన వృద్ధురాలుని(అవ్వ) వైకాపా ప్రభుత్వం అవమానించడం విచారకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కత్తిమానుపల్లికి చెందిన పుల్లమ్మకి భూమి ఉందని సాకు చూపి పెన్షన్ కట్ చేశారన్నారు.
Lokesh on old woman pension: విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజే దివ్యాంగురాలుకి అవమానం: లోకేశ్ - ఏపీ వార్తలు
Lokesh on old woman pension cut: ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజునే దివ్యాంగురాలైన అవ్వని జగన్ ప్రభుత్వం అవమానించడం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కత్తిమానుపల్లికి చెందిన అవ్వకు వెంటనే పింఛను పునరుద్ధరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Lokesh on old woman pension
అసలు తనకి భూమే లేదని మొర పెట్టుకున్నా.. కరుణించని అధికారులు.. జగనన్నకి మొక్కుకో అంటూ అవమానపర్చేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తక్షణమే పుల్లమ్మ పింఛను పునరుద్ధరించాలని లోకశ్ డిమాండ్ చేశారు. పండుటాకుల ఆసరా తీసేసి ఏంటీ అరాచకం ముఖ్యమంత్రి గారూ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి..:Jagan assets case: "ప్రజాప్రయోజనాల కోసం.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి"