అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని అడదాకులపల్లి గ్రామంలో మంత్రి శంకరనారాయణ, టి.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా అనుకూలించకపోయినప్పటికీ... ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా కట్టడిలో భాగం కావాలని ఆయన సూచించారు.
'పేద ప్రజల సంక్షేమమే ... ప్రభుత్వ ధ్యేయం' - అడదాకులపల్లిలో లాక్డౌన్
లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు పలువురు దాతలు అండగా ఉంటున్నారు. సీఎం జగన్ పిలుపుమేరకు పార్టీ శ్రేణులు పేదలకు చేయూతనందిస్తున్నాయని మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా అడదాకులపల్లిలో ప్రజలకు ఆయన కూరగాయలను, నిత్యావసర సరకులను అందించారు.
అడదాకులపల్లిలో పేదలకు నిత్యావసర సరకుల వార్తలు