అనంతపురంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గలా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురంలోని స్కందా కంపెనీలో పని చేస్తున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఉపాధి నిమిత్తం అనంతపురం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య - అనంతపురం నేర వార్తలు
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మృతి చెెందిన వ్యక్తి తెలంగాణకు వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య