లాక్డౌన్ కంటే ముందు అనంతపురం జిల్లా మడకశిర ఆర్టీసీ డిపో నుంచి 36 బస్సు సర్వీసులు వివిధ ప్రాంతాలకు ఉండేవి. అన్‌లాక్ సడలింపులల్లో భాగంగా ప్రస్తుతం డీపో నుంచి 16 బస్సు సర్వీసులు తిరుగుతున్నాయి. డిమాండ్‌ను బట్టి అయిదు అంతర్రాష్ట్ర సర్వీసులను నడుపుతున్నారు.
కిలోమీటరకు 45 పైసలు రావాల్సి ఉండగా 35 పైసలు మాత్రమే వస్తోందని.. దీంతో నెలకు దాదాపు 75 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
పూర్తిస్థాయి ప్రయాణికులకు అనుమతి..
నష్టాలతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి బస్సులో పూర్తిస్థాయి ప్రయాణికులకు అనుమతిస్తూ.. మడకశిర నుంచి అనంతపురం, కర్నూలు, విజయవాడ, నెల్లూరుతో పాటు బెంగళూరు, చిత్రదుర్గం ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నామని... ఈ క్రమంలో రానున్న రోజుల్లో మడకశిర ఆర్టీసీ డిపోకు ఆశాజనకంగా ఆదాయం చేకూరుతుందని డిపో మేనేజర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:స్టీరింగ్ వదిలి... సాగుకు కదిలి..