ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుత దాడి.. మేక మృతి - అనంతపురం జిల్లా యాటకల్లులో మేకలపై చిరుత దాడి వార్తలు

ఆ మేకలు.. మేత కోసం శివారు ప్రాంతానికి వెళ్లాయి. కడపునిండా మేసి తృప్తిగా ఇళ్లకు తిరుగుపయనమయ్యాయి. ఇంతలో అనుకోని ఉపద్రవంలా ఓ చిరుత మందపై పడింది. ఈ ఘటనలో ఒక మేక మృత్యువాత పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా యాటకల్లులో జరిగింది.

Leopard attacks on herds of goats at yaatakallu ananthapuram district
చిరుత దాడిలో చనిపోయిన మేక

By

Published : Apr 26, 2020, 2:33 PM IST

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామ శివార్లలో మేకల మందపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మేక మృతిచెందింది. గ్రామానికి చెందిన లింగమయ్య మేత కోసం మేకలను శివారు ప్రాంతానికి తోలుకెళ్లాడు. తిరిగి వస్తున్న సమయలో గజ్జలకొండ వద్ద ఘటన జరిగింది. చిరుత సంచారంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details