అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరులో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త సత్యనారాయణ ఆమెను కడతేర్చాడు. శనివారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న భార్య సాలెమ్మను తలపై రోకలి బండతో బాది హతమార్చాడు. వీరికి నలుగురి సంతానం. ముగ్గురు కుమార్తెల వివాహం కోసం అప్పులు చేశారు. వీటికి తోడు సత్యనారాయణ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీనివల్ల కుటుంబ పోషణ భారం కావడం వల్ల సాలెమ్మ కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానంతో తరుచూ భర్త గొడవపడేవాడు. చుట్టుపక్కల వాళ్లు పలుమార్లు సర్ది చెప్పారు. చివరకు మద్యం మత్తులో ఉన్న భర్త... భార్యను హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యను చంపిన భర్త... అనుమానమే కారణమా..? - ఇగుడూరులో భార్యను చంపిన భర్త
అనుమానం పెనుభూతం అని మరోసారి రుజువైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త... రోకలి బండతో కొట్టి చంపి ఆమె పాలిట యముడయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఇగుడూరులో జరిగింది.
![భార్యను చంపిన భర్త... అనుమానమే కారణమా..? husband murdered wife at iguduru in ananthpuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5837728-621-5837728-1579949905614.jpg)
ఇగుడూరులో భార్యను చంపిన భర్త....
TAGGED:
ఇగుడూరులో భార్యను చంపిన భర్త