బొలెరో, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి - Accident in anantapuram One man dead
అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌర విద్యుత్ ప్రాజెక్టు వద్ద బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులో కూలి పనికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని... ఎదురుగా వచ్చినా బొలెరో ఢీకొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా... గాయపడిన మరొకరిని చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.