భార్యపై భర్త దాడి - ANATAPURAM DISTRICT
భార్యపై హత్యాయత్నం చేసిన భర్త... పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
భార్యపై భర్త దాడి
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీసీ కొత్తకోట గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళపై ఆమె భర్త నరసింహుడు వేటకొడవలితో దాడి చేశాడు. దాడిలో లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. భార్యపై హత్యాయత్నం చేసిన నరసింహుడు... ధర్మవరం గ్రామీణ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. లక్ష్మీదేవినీ చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నరసింహుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు.