ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rape Attempt in Police Station: దారుణం.. పోలీస్​స్టేషన్​లో​ వివాహితపై హోంగార్డ్​ అత్యాచారయత్నం

Rape Attempt in Kambaduru Police Station: అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుందని ప్రజలు పోలీస్​ స్టేషన్​కు వెళ్తారు. కానీ ఓ వివాహితకు న్యాయం జరగాల్సిన ప్రదేశంలో అన్యాయం జరిగింది. ప్రజల మానప్రాణాలు రక్షించాల్సిన హోంగార్డ్ మద్యం మత్తులో కీచక అవతారం ఎత్తాడు. అనంతపురం జిల్లా కంబదూరు పోలీస్ స్టేషన్​కు చెందిన హోంగార్డ్ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

home guard attempted to rape woman
అనంతపురంలో వివాహిత పై హోంగార్డ్ అత్యాచారయత్నం

By

Published : Jul 25, 2023, 7:32 PM IST

Homeguard Rape Attempt Rape on Woman: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్​లో వివాహితపై హోంగార్డ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ మహిళా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంబదూరు మండలానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యమైందని ఈ నెల 12న పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆమె బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత తనపై జరిగిన ఘోరాన్ని బాధితురాలు తెలిపింది. పోలీసులు తనతో మాట్లాడితే.. 22న కంబదూర్​ పోలీస్​ స్టేషన్​కు వచ్చినట్లు బాధితురాలు వివరించింది. తాను వచ్చినట్లు తల్లిదండ్రులకు పోలీసులు సమాచారమిచ్చారు. వారు వచ్చే వరకు తాను పోలీస్​ స్టేషన్​లో ఉన్నానని.. అప్పుడు తనను హోంగార్డ్​ శివానంద రిసెప్షన్ గదిలోకి బలవంతంగా తీసుకెళ్లాడని ఆమె తెలిపింది.

మద్యం మత్తులో ఉన్న శివానంద తనపై అత్యాచారం చేయడానికి యత్నించగా.. తప్పించుకుని, గట్టిగా ఏడుస్తూ పోలీస్ స్టేషన్ బయటకు పరుగులు తీశానని తెలిపింది.పోలీస్ స్టేషన్​లో తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ విషయం బయటకు పొక్కి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

ఈ విషయం ప్రపంచానికి తెలియడంతో అమమానంగా భావించిన భాదితురాలు మనస్థాపానికి గురైంది. మంగళవారం ఉదయం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధిత మహిళను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హోంగార్డ్​ సస్పెన్షన్​:ఈ ఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న జిల్లా ఎస్పీ హోంగార్డ్​ శివానందను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. పోలీస్ శాఖలో ఏ అధికారైన క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసులే ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురంలో వివాహితపై హోంగార్డు అత్యాచారయత్నం

"మా చెల్లెలు కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. బెంగుళూరులో ఉన్న మా చెల్లికి ఎస్ఐ ఫోన్ చేసి రమ్మన్నారు. మా చెల్లి స్టేషన్​కు వచ్చింది. స్టేషన్​లో ఎస్ఐ లేరు. హోంగార్డ్ చాలా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా.. చెడుగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగాఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. విషయం బయటకు వచ్చింది. విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది."- బాధితురాలి సోదరుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details