ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు వలయంలో తాడిపత్రి పురపాలక భవనం - High Tension In Tadipatri

తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్‌ ఎన్నికకు సమయం దగ్గర పడటంతో ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్‌ సమావేశానికి అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలు దాటినా రాకపోతే ఎన్నికల అధికారి (ఆర్డీవో) నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

పోలీసు వలయంలో తాడిపత్రి పురపాలక భవనం
పోలీసు వలయంలో తాడిపత్రి పురపాలక భవనం

By

Published : Mar 18, 2021, 6:16 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్‌ ఎన్నికకు సమయం దగ్గర పడటంతో ఉత్కంఠ నెలకొంది. గురువారం కౌన్సిల్‌ సమావేశానికి అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మాజీఎమ్మెల్యే, 24వ వార్డు కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డిలతో కలిసి శిబిరంలోని తెదేపా కౌన్సిలర్లు ఉన్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. తెదేపా కౌన్సిలర్లకు 18న కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకావాలని నోటీసులు ఇచ్చినట్లు పురపాలక సంఘం ఎన్నికల అధికారి నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలు దాటినా రాకపోతే ఎన్నికల అధికారి (ఆర్డీవో) నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

వాయిదాకు మొగ్గు..?

గురువారం చైర్మన్‌ ఎన్నిక రసాభాసగా మారే అవకాశాలూ లేకపోలేవు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కౌన్సిలర్‌గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. పోలీసులకు, మీడియాకు సమావేశ భవనంలోకి అధికారులు ప్రవేశం కల్పించలేదు. ఛైర్మన్‌ ఎన్నికకు పోలీసులు బుధవారం నుంచే భారీ భద్రతను కల్పించారు. పురపాలక సంఘం భవనం చుట్టూ కిలోమీటరు మేర రహదారులను మూసేస్తున్నామని, శాంతిభద్రతల కోసం 600 మంది పోలీసులను మోహరించామని డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టణమంతా 144 సెక్షన్‌ విధించామన్నారు. 12 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 2 డాగ్‌ స్క్వాడ్‌లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పురపాలక సంఘం భవనం పరిసరాలను పరిశీలించేందుకు డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండీ... నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

ABOUT THE AUTHOR

...view details