అనంతపురం జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా గురువారం హైకోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. ఓ యువతిని తమ ముందుకు తీసుకురావాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తన భార్యను ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారనీ.. తన భార్యను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రవీణ్ కుమార్, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్‌ది ప్రేమ వివాహమనీ.. ప్రస్తుతం ఆ యువతి ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్లో వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ యువతిని తీసుకొని ఎస్పీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
'ఆ యువతిని తీసుకొని.. ఎస్పీ హైకోర్టులో హాజరు కావాలి' - హెబియస్ కార్పస్ రిట్‌పై హైకోర్టు వార్తలు
తల్లిదండ్రులు నిర్బంధించిన యువతిని తీసుకొని.. అనంతపురం ఎస్పీ వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో దాఖలు అయిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది.
హైకోర్టు