ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షంతో అనంత అతలాకుతలం

అనంతపురంలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలుప్రాంతాల్లో ఎక్కడికక్కడ విద్యుత్తు నియంత్రికలు, తీగలు తెగిపడ్డాయి. ఫలితంగా సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి.

By

Published : May 8, 2020, 3:56 PM IST

భారీ వర్షంతో అనంత అతలాకుతలం
భారీ వర్షంతో అనంత అతలాకుతలం

అనంతపురంలో గత రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు, వర్షానికి నగరంలో 18గంటలుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని కాలనీల్లో పెద్ద వృక్షాలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. మరి కొన్నిచోట్ల చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటం వల్ల పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లేడీస్ క్లబ్ సమీపంలో 9 విద్యుత్ స్తంభాలతో పాటు విద్యుత్ నియంత్రికలు కూలిపోయాయి.

నిన్న రాత్రి నుంచే మరమ్మతు చర్యలు చేపట్టిన విద్యుత్ సిబ్బంది ఈరోజు మధ్యాహ్నానికి పనులు పూర్తయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. విద్యుత్ లైన్లను పూర్తిగా మార్చాల్సి ఉన్నందున సాయంత్రం 6 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు కూలిన చోట వేగవంతంగా పనులు నిర్వహించాలని కోరారు. అదనంగా సిబ్బందిని, కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:అకాల వర్షం... కాస్త ఉపశమనం

ABOUT THE AUTHOR

...view details