నిర్లక్ష్యం చేస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించాలని అధికారులను టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వరద నీరు, ఇతర కారణాల వల్ల అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కోతకు గురవుతుంది. కొద్దికొదిగా మట్టిపెళ్లలు విరిగి నీళ్లలోకి పడుతుండడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
గట్టు తెగి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, పంట పోలాలు జలమయం అయ్యే అవకాశం ఉందని.... వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను పయ్యావుల కేశవ్ కోరారు.