అనంతపురం జిల్లా ముదిగుబ్బలో నిషేధిత గుట్కా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కడప జిల్లాకు చెందిన గడ్డం సుధాకర్ రెడ్డి, చింత గింజల సునీల్ అనే వ్యక్తులు కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గుట్కా ప్యాకెట్లు కొనుగోలు చేసి కడపకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముదిగుబ్బలో గుట్కా పట్టివేత.. ఇద్దరి అరెస్టు - gutka packets seezed at ananthapuram district
అనంతపురం జిల్లా ముదిగుబ్బలో నిషేధిత గుట్కా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు.
ముదిగుబ్బలో గుట్కా పట్టివేత