అనంతపురంలో బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో థియేటర్లలో పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న 400 మందికి సరకులు పంపిణీ చేశారు. కథానాయకుడు బాలకృష్ణ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
థియేటర్ కార్మికులకు సరకులు పంచిన బాలకృష్ణ ఫ్యాన్స్ - అనంతపురంలో థియేటర్ కార్మికులకు బాలకృష్ణ అభిమానుల సహాయం
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. అనంతపురంలో సినిమా హాల్లో పనిచేసే కార్మికులకు సరకులు పంపిణీ చేశారు.
థియేటర్ కార్మికులకు సరకులు పంచిన బాలకృష్ణ ఫ్యాన్స్