లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని మడకశిర పట్టణంలో నేడు.. ఓ మహిళకు అధికారులు పాజిటివ్‌గా నిర్ధారించారు. పట్టణ వాసులు భయాందోళనకు లోనయ్యారు. అప్రమత్తమైన పోలీసులు.. కరోనా సోకిన మహిళ నివసిస్తున్న వీధికి రాకపోకలను నిషేధించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.
మడకశిరలో మొదటి కరోనా పాజిటివ్ నమోదు - అనంతపురం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య
అనంతపురం జిల్లా మడకశిరలో మొట్ట మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా పట్టణంలోని రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.
మడకశిరలో మొదటి కరోనా పాజిటివ్ నమోదు