ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అప్రమత్తత.. అగ్నిమాపక సిబ్బంది తెగువే కాపాడింది...! - anantapur district news

అనంతపురం నగరంలో రాత్రి విధుల్లో ఉన్న పోలీసుల అప్రమత్తత వల్ల భారీ అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆస్తి నష్టాన్ని వారు నివారించారు.

fire accident
పోలీసుల అప్రమత్తత వల్ల భారీ అగ్ని ప్రమాదం తప్పింది

By

Published : Apr 29, 2021, 8:01 PM IST

అగ్ని ప్రమాదాన్ని వివారించిన పోలీసులు వివరాలు తెలుపుతూ...

అనంతపురం మూడో పట్టణ పోలీసుల అప్రమత్తతతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ వుడ్ వర్క్ గోడౌన్ సమీపంలో మంటలు చెలరేగాయి. రాత్రి డ్యూటీలో ఉన్న మూడో పట్టణ పోలీసులు దీనిని గమనించి.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

సకాలంలో స్పందించిన వారు మంటలను అదుపు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ అగ్ని ప్రమాదానికి కారకులైన ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ. 50 లక్షలు విలువచేసే దుకాణాన్ని రక్షించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బందికి, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై బలరాం ప్రోత్సాహంగా రూ.1000 చిరు బహుమతి అందించారు. నష్టం నుంచి దుకాణం యజమానులను కాపాడడంపై సంతోషం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దుకాణం యజమానులు సైతం పోలీసుల సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details