కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. క్షవరం కూడా అందుకు అతీతం కాలేదు. అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లిలో ఓ వ్యక్తి తన పిల్లలకు తానే బార్బర్ అయ్యాడు. ఒత్తుగా పెరిగిన కుమారుల జుట్టును కత్తిరించాడు. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇలా ఎవరికి వారే కుటుంబసభ్యుల సహకారంతో క్షవరం చేసుకుంటున్నారు.
కరోనా ఎఫెక్ట్: పిల్లలకు క్షవరం చేసిన తండ్రి - మడకశిరలో కరోనా కష్టాలు
రాష్ట్రంలో లాక్ డౌన్ విధించి నెలరోజులు అయ్యింది. పిల్లాపెద్దా అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. నిత్యావసర దుకాణాలు, మందుల షాపులు తప్ప వేరేవేవీ తెరుచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఎవరికి వారే కుటుంబసభ్యుల సహకారంతో క్షవరం చేసుకుంటున్నారు.

పిల్లలకు క్షవరం చేసిన తండ్రి