అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కూరగాయలను రోడ్డుపై పోసి రైతులు నిరసన తెలిపారు. కొత్తగా తెచ్చిన ఆన్లైన్ విక్రయాల ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో కొనే వ్యాపారులు పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని వారు చెప్పారు. పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని.. ఆన్లైన్ విధానం తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
FARMERS PROTEST: రోడ్డుపై కూరగాయలు పోసి.. రైతుల ఆందోళన
హిందూపురంలో రోడ్డుపై కూరగాయలు పోసి రైతులు ఆందోళన చేపట్టారు. కూరగాయల మార్కెట్లో సరైన సదుపాయాలు లేక తాత్కాలిక స్థలంలో లావాదేవీలు కొనసాగిస్తుంటే కొత్తగా ఆన్లైన్ అమ్మకాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
farmers protest in hindupuram road
ప్రజా ప్రతినిధులు రాజకీయ లబ్ధి కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పోలీసులు, తహసీల్దార్ అంబేడ్కర్ సర్కిల్ వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: 'మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతా ప్రభుత్వానిదే'