విత్తనాలు లేవని అధికారులు చెప్పడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తోన్నా... అధికారులు విత్తన సమస్యను పరిష్కరించలేక పోతున్నారు. విత్తనాల కోసం ఉదయం నుంచే పంపిణీ కేంద్రం వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలోనే... గుంతకల్లులో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రోడ్డెక్కిన రైతన్న... విత్తనాల కోసం ఆందోళన - వేరుశనగ విత్తనాలు కోసం
వేరుశనగ సాగుకు వారం మాత్రమే గడువు ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని మార్కెట్ యార్డులోని రైతులు ధర్నా నిర్వహించారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్త చేస్తున్న రైతులు