అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని చదం గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేశారు. మల్లాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ ఎంటర్ప్రైజెస్ తెల్ల కంకర క్రషర్ యాజమాన్యంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొండ పక్కన ఉన్న దళితుల భూములను క్రషర్ యాజమాన్యం ఆక్రమించుకుంటోందని.. ప్రభుత్వం కేటాయించిన లీజులను తక్షణం రద్దు చేయాలని వారు కోరారు.
క్వారీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతుల ధర్నా - రైతుల ధర్నా
అనంతపురం జిల్లా మల్లాపురం పరిధిలోని గణేష్ ఎంటర్ప్రైజెస్ క్వారీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు ధర్నా చేపట్టారు. తమ భూములు ఆక్రమించారని తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
చదం గ్రామానికి చెందిన దళిత రైతుల 14 ఎకరాల భూమిని ఆక్రమించుకొని క్రషర్ యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని పేర్కొన్నారు. క్రషర్ కోసం భారీ పేలుళ్లు జరపడం వల్ల దుమ్ము, ధూళి పొలాలపై పడి పంటలు పండక తీవ్రంగా నష్టాపోతున్నామని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారులు.. క్వారీ, క్రషర్లు ఉన్న ప్రాంతాల్లో సర్వే జరిపి ఆక్రమణకు గురైన భూములను సంబంధిత రైతులకు తిరిగి పంపిణీ చేయాలని రాయదుర్గం తహసీల్దార్ సుబ్రహ్మణ్యానికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:'మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలి'