అనంతపురం జిల్లా తాడిపత్రిలోని చుక్కలూరులో ఐచర్ వాహనం ఢీ కొని వెంకటేష్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బండల కర్మాగారంలో కూలీ పని చేసేవాడు. తెల్లవారుజామున స్నానం చేసేందుకు అంజనేయస్వామి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఐచర్ వాహనం ఢీ కొట్టింది. గమనించిన గ్రామస్థులు వాహనాన్ని అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
చుక్కలూరులో వాహనం ఢీ కొని వ్యక్తి మృతి - చుక్కలూరులో ఐచర్ ఢీ కొని వ్యక్తి మృతి వార్త
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామ సమీపంలో ఐచర్ వాహనం ఢీ కొని వెంకటేష్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
![చుక్కలూరులో వాహనం ఢీ కొని వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5060494-560-5060494-1573720543556.jpg)
చుక్కలూరులో ఐచర్ ఢీ కొని వ్యక్తి మృతి