ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిశ'పై అవగాహనే బాలికను కాపాడింది

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన 'దిశ' యాప్​తో మారుమూల తండాలోని బాలికకు రక్షణ కల్పించారు పోలీసులు. మారుమూల గ్రామాల్లోని యువతులు దిశ యాప్ గురించి తెలుసుకోవడం వల్లే నిందితున్ని వెంటనే పట్టుకున్నామని అనంతపురం పోలీసులు తెలిపారు.

anantpur district
దిశా యాప్ ద్వారా తాండ బాలికకు రక్షణ

By

Published : Feb 17, 2020, 11:49 PM IST

Updated : Feb 18, 2020, 7:23 AM IST

దిశ యాప్ ద్వారా తండా బాలికకు రక్షణ

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో ఓ బాలిక అర్ధరాత్రి వేళ 'దిశ' యాప్ ద్వారా రక్షణ పొందింది. ఊరంతా బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొంది. ఈ క్రమంలో తండాకు చెందిన బాలిక (16) నిద్ర వస్తుండడంతో రాత్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలోని ఇంటికి వెళ్తుండగా.. తిరుపాల్ నాయక్ (21) అనే యువకుడు వెంటపడ్డాడు. అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు అతడిపై దాడి చేసి కేకలు వేయడంతో పాటు తక్షణ సాయం కోసం 'దిశ' యాప్​కు మెసేజ్ చేసింది. అదే సమయంలో బాలిక బంధువు ఈ ఘటనను గమనించి అక్కడికి చేరుకోగా యువకుడు పరారయ్యాడు.

కంట్రోల్ రూం నుంచి సమాచారంతో...

విజయవాడ 'దిశ' కంట్రోల్ రూమ్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయానికి బాధితురాలి సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు కేవలం పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి.. ఇంట్లో దాక్కున్న ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండీ:

జగన్ ఆధ్వర్యంలో సువర్ణ పాలన

Last Updated : Feb 18, 2020, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details