Cyber Scam In Anantapur District :చదువు పూర్తయ్యిందంటే చాలు ఉద్యోగం కోసం ఎక్కడెక్కడికి వెళ్లాలో అని అనుకుంటారు కొందరు. ఇంటి దగ్గరే ఉండి సంపాదించే ఉద్యోగం అయితే బాగుండు అనుకుంటారు... అలాంటి వాళ్లే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో సైబర్ మోసం జరిగింది. రూ. 35 కోట్లు కొట్టుకెళ్లారు సైబర్ కేటుగాళ్లు. అన్యాయం జరిగిందని, నష్టపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను సంప్రదించారు. చదువుకున్న వారు కూడా గుర్తించలేని విధంగా మాయ చేయడం దారుణమంటున్నారు విషయం తెలిసిన స్థానికులు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలిస్తామంటూ యువతను మోసం చేసి రూ.35 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు.
అసలు సైబర్ నేరగాళ్లు ఏంచేశారంటే..?
Work From Home Cyber Scam In Ap 2023 :అనంతపురం జిల్లా గార్లదిన్నెకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సైబర్ నేరం గుట్టు బయట పడింది. మొదట నిరుద్యోగులకు టెలిగ్రాం యాప్ ద్వారా లింక్ పంపి దాని నుంచి వారి వివరాలు తెలుసుకొని కొంత పని అప్పగిస్తారు. పని పూర్తయ్యాక రూ.20వేల నుంచి రూ.30వేల రూపాయలను బాధితుడి ఖాతాలకు బదిలీ చేస్తారు. బాధితుని ఖాతాలో సొమ్ము కనిపిస్తుంది కాని, విత్ డ్రా చేసుకొనే అవకాశం లేకుండా చేస్తారు. కొందరికి మాత్రం విత్ డ్రా చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు. ఎక్కువ పని చేస్తే అధిక ఆదాయం పొందవచ్చు అని నమ్మకం కల్పిస్తారు. మధ్యలో పని వదిలేయకుండా పదిశాతం నగదును డిపాజిట్ చేయాలని సూచిస్తారు.