కక్షసాధింపుదిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వాదిస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలకు తగ్గట్టుగా ... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎర్రగొండాపురంలో 23 ఎకరాల్లోని దానిమ్మ చెట్లను వైకాపా కార్యకర్తలు నరికేశారని బాధితరైతులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధితరైతులు పొలాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ ఉమామహేశ్వరనాయుడు పలువురు సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే గుర్తించి రైతులకు సహాయం అందించాలని పోలీసులకు సూచించారు.
చేతులారా...చేతికొచ్చిన పంటను నరికేశారు - తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీకి చెందిన రైతుల పొలాల్లో 23 ఎకరాల్లోని సుమారు 3500 దానిమ్మ చెట్లను వైకాపా నాయకులు నరికేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఎర్రగొండాపురంలో చోటుచేసుకుంది.
చేతులారా...చేతికొచ్చిన పంటను నిరికేశారు.