ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. ఇద్దరిలో ఒకరికి వైరస్‌ - అనంతపురం జిల్లాలో కరోనా కేసులు

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదు కావటమే కాకుండా పరీక్ష చేసిన ఇద్దరిలో ఒకరికి వైరస్ ఉన్నట్లుగా నిర్దరణ అవుతోంది. పరీక్ష చేసిన నమూనాల్లో దాదాపు సగం మందికి వైరస్ ఉన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.

అనంతపురంలో కరోనా
అనంతపురంలో కరోనా

By

Published : May 20, 2021, 6:28 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పరీక్షించిన ఇద్దరిలో ఒకరికి వైరస్‌ ఉన్నట్లుగా నిర్ధరణ అవుతోంది. గత ఐదు రోజులుగా 45 శాతం పాజిటివిటీ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్థానికంగానే జ్వరం, జలుబు మందులు తీసుకుని గ్రామాల్లోనే ఉండిపోతున్నారు తప్పితే..ఎవరికీ చెప్పట్లేదని.. తీరా వ్యాధి ముదిరిపోయాక పరుగులు పెడుతున్నారని అనంతపురం మెడికల్ కళాశాల ఇన్​ఛార్జ్ ప్రిన్సిపాల్ డా. సాయి సుధీర్ అభిప్రాయపడ్డారు.

అనంతపురం జిల్లాలో పరీక్షించిన ఇద్దరిలో ఒకరికి వైరస్‌

తుది దశకు ఫీవర్ సర్వే..

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేలో భాగంగా ఫీవర్ సర్వే చేయిస్తోందని జిల్లా వైద్యాధికారి డా. కామేశ్వర ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఐదు విడతల ఫీవర్ సర్వే పూర్తై, ఆరో విడత సర్వే తుది దశకు చేరుకుంది. ఈ మొత్తం సర్వేలో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలున్న బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ లక్షణాలున్న వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ గా నిర్దరణ అవుతోందన్నారు. ఫీవర్ సర్వేతో గ్రామాల్లో వైరస్​ను అదుపులోకి తెచ్చే మందులు ఇస్తున్నప్పటికీ.. ప్రజలు వాటిని సక్రమంగా తీసుకోకపోవటం వల్ల వ్యాధి తీవ్రస్థాయికి చేరుతుందన్నారు.

ఇదీ చదవండి

కొవిడ్‌కు ఆర్‌ఎంపీ వైద్యం!

ABOUT THE AUTHOR

...view details