కరోనా మహమ్మారి గ్రామాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో ఓ మహిళకు కొవిడ్ సోకింది. ఆమెకు జ్వరం వస్తుండటంతో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా.. కరోనా పరీక్ష చేశారు. ఫలితాల్లో పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు గ్రామం మొత్తాన్ని హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు. ఆమెతో కాంటాక్టులో ఉన్న వ్యక్తుల్ని గుర్తించే పనిలో పడ్డారు.
అమిద్యాలలో మహిళకు కరోనా.. అధికారుల అప్రమత్తం - అనంతపురం జిల్లాలో కరోనా కేసుల తాజా వార్తలు
అనంతపురం జిల్లా అమిద్యాలలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. అధికారులు ఆమెతో కాంటాక్టులో ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
అమిద్యాలలో కరోనా కేసులు