ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జల్సాల కానిస్టేబుల్ మోసం... అద్దెకు కార్లు తీసుకొని విక్రయం...

అనంతపురం జిల్లా పుట్లూరు పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమేష్ అనే కానిస్టేబుల్... కార్లు అద్దెకు తీసుకుని 20మందిని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రమేష్​ను అరెస్టు చేసి అతని వద్ద నుండి మూడు కార్లను స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించినట్లు పుట్లూరు ఎస్సై తెలిపారు.

constable in ananthapur gets arrested due to making fraud
న్యాయం చేయాల్సిన వారే అన్యాయం చేస్తే...!!

By

Published : Aug 5, 2020, 10:11 AM IST

Updated : Aug 5, 2020, 11:42 AM IST



అనంతపురం జిల్లా పుట్లూరు పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమేష్ కార్లు అద్దెకు తీసుకుని వాటిని విక్రయించి జూదానికి బానిసై, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ విధంగా 20 మందిని మోసం చేసి... కార్లు కిరాయికి కావాలని వారిని నమ్మించి తీసుకెళ్లి వాటిని వేరే వాళ్లకు విక్రయించి జల్సాలకు పాల్పడ్డాడు. తాను కానిస్టేబుల్ అని బెదిరించి ఆ వాహనాలను ఎంతో కొంత డబ్బులకు అమ్మి... వచ్చిన డబ్బుతో జూదం ఆడేవాడని, కార్ల యజమానులు ప్రశ్నిస్తే వారిని బెదిరించేవాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు రమేష్​ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు. రమేష్​కు కార్లు ఇచ్చి మోసపోయిన వారికి వారి వాహనాలను అందజేస్తామని పుట్లూరు ఎస్సై తెలిపారు. ఇలాంటి మోసపూరితమైన చర్యలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Last Updated : Aug 5, 2020, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details