ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు: రఘువీరారెడ్డి - anathapuram

వైయస్ రాజశేఖర్ ​రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా చూడటం లేదనీ, ఒక కుటుంబ పెద్ద అన్నను కోల్పోయిన బాధ తమకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి అన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు : రఘువీరారెడ్డి

By

Published : Sep 3, 2019, 11:26 AM IST

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు : రఘువీరారెడ్డి
అనంతపురం జిల్లా మడకశిరలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి నివాళులర్పించారు. వైయస్ విగ్రహానికి పూల మాలవేసి, కార్యాకర్తలతో కలిసి మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణం జీర్ణించుకోలేని బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వ ఫలాలను అని సామాన్యుడికు సైతం అందించిన మహానీయుడనీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడని వ్యాఖ్యానించారు. వైయస్​ను రాజకీయనాయకుడిగా చూడటం లేదనీ, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ ఉందనీ రఘువీరారెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details