అనంతపురం జిల్లాలో ఈ నెల 8వ తేదిన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు అధికార్లు. పెనుగొండ మండలం ఎర్రమంచిలోని కియా పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను భద్రతా సిబ్బంది పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది హెలిప్యాడ్ పరిసరాలను తనిఖీ చేశారు. పెనుకొండ డీఎస్పీ రామకృష్ణ, సీఐ శ్రీహరి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
అనంత సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో సిఎం పర్యటన నేపథ్యంలో పెనుగొండ మండలం కియా పరిశ్రమ వద్ద భద్రతా సిబ్బంది హెలిప్యాడ్ ను పరిశీలించారు.
సీఎం పర్యటనకు..భద్రతా ఏర్పాట్ల పరిశీలన