ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ... మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Feb 27, 2021, 7:52 PM IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన బంధువు గౌరీనాథరెడ్డి పై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలోని బృందావన్ అపార్ట్మెంట్​లో జేసీ ప్రభాకర్ రెడ్డి సమీప బంధువైన గౌరీనాథరెడ్డి పెంట్ హౌస్ లో నగదు, క్రికెట్ కిట్లు దాచి ఉంచారని సమాచారం మేరకు ఈనెల 25వ తేదీన పట్టణ సీఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 60 క్రికెట్ కిట్లు పట్టుబడ్డాయి. క్రికెట్ కిట్లు స్వాధీనం చేసుకొని మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి క్రికెట్ కిట్లను పెంట్ హౌస్ లో ఉంచారని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, పెంట్ హౌస్ యజమాని గౌరీనాథ్ రెడ్డి లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రసాదరావు తెలిపారు.

ఆధారాలు ఉన్నాయి: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేసు నమోదుపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. క్రికెట్ కిట్లకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2018 సంవత్సరంలో క్రికెట్ పోటీలు పెట్టామని.. ఆ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులకు క్రికెట్ కిట్లు అందజేశామని స్పష్టం చేశారు. వాటిలో కొన్ని కిట్లు మిగిలాయని.. వాటికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి

అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కోరతాం: సుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details