అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం, మినీ వ్యాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోలు బయటికి వచ్చి ఇంజిన్‌పై పడిన కారణంగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు మంటలు ఆర్పేశారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్, మినీ వ్యాన్ ఢీ.. ద్విచక్రవాహనం దగ్ధం - byke burned in accident at dharmavaram in ananthapur
అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం దగ్ధం