రెండు దశాబ్దాల కిందటి పురాతన ఉత్సవ విగ్రహాలు తిరిగి యథాస్థానానికి చేరుకున్నాయి. అనంతపురం జిల్లా పొలికి గ్రామంలో ఆస్పర్తి లక్ష్మీపతి అనే పూజారి... గతంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో చేసేవారి. ఈ క్రమంలో ఆ విగ్రహాలను తీసుకొని... 2 దశాబ్దాల క్రితం గ్రామాన్ని వదిలి వెళ్లారు. కాలక్రమేణా పండితులకు చెందిన మూడో తరం వారు విగ్రహాల చరిత్రను తెలుసుకొని... తిరిగి పొలికి గ్రామానికి తీసుకొచ్చారు. ఇవాళ ఆలయ ధర్మకర్తలు, గ్రామప్రజల పూజల మధ్య తిరిగి ఆలయంలో పునఃప్రతిష్ట చేశారు.
ఇదీ చదవండి : చిన్నవయసులోనే స్కేటింగ్‌లో ప్రతిభ... ప్రపంచ రికార్డు కోసం...