అనంతపురం జిల్లా బత్తలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై భాజపా నాయకులు రాస్తారోకో చేశారు. భాజపా కార్యకర్తలను అనవసరంగా పోలీసులు పట్టుకెళ్లి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఇదే పరిస్థితి ఉందని భాజపా జిల్లా అధ్యక్షుడు అంకుల్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో మొదట బత్తలపల్లిలో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కూడలి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు అనవసరంగా తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరిని విడుదల చేశామని పోలీసు అధికారులు తెలిపాక రాస్తారోకో విరమించారు. అనంతరం బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ దృష్టికి భాజపా నాయకులు సమస్యలను తీసుకెళ్లారు. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని డీఎస్పీ అన్నారు.
బత్తలపల్లి పోలీస్స్టేషన్ వద్ద భాజపా నేతల రాస్తారోకో - battanapalli
అనంతపురం జిల్లా బత్తలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భాజపా నేతలు రాస్తారోకో చేశారు. వైకాపా ప్రభుత్వంపై భాజపా జిల్లా అధ్యక్షుడు అంకుల్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసి పోలీసులు తప్పడు కేసులు బనాయిస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపించారు. అనంతరం డీఎస్పీని వద్దకు సమస్యను తీసుకెళ్లారు.
బత్తలపల్లి పోలీస్స్టేషన్ వద్ద భాజపా నేతల రాస్తారోకో