వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటేనే మన భవిష్యత్ మనుగడ ఉంటుందని కేంద్ర జల శక్తి అభయాన్ డైరెక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. నీటి పరిరక్షణపై అనంతపురం జిల్లా కంబదురులోని కేజీబీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నీటి నిర్వహణ పై ఆయన చేసిన ప్రసంగం విద్యార్దులను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిష్ణాతులు కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఉదహరించిన విధంగా విద్యార్దులు జీవితంలో రాణించాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
నీటిసంరక్షణపై అవగాహనా కార్యక్రమం - కంబదూరు
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని కేజీబీ పాఠశాలలో నీటి పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జల శక్తి అభయాన్ డైరెక్టర్ అరుణ్ కుమార్.
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అరుణ్ కుమార్