ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో కరోనా వేషధారి ద్వారా అవగాహన - అనంతపురం జిల్లాలో కరోనా కేసులు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కరోనాపై వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆర్​డీటీ సంస్థ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో పట్టణంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి కరోనా వేషం వేసుకున్న వ్యక్తి అవగాహన కల్పించారు.

కరోనా వేశధారి ద్వారా అవగాహన
కరోనా వేశధారి ద్వారా అవగాహన

By

Published : Aug 1, 2020, 12:01 AM IST




అనంతపురం జిల్లా ఉరవకొండలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి కరోనా వేషం వేసుకున్న వ్యక్తి వారికి అవగాహన కల్పించారు. మాస్కు లేకుండా బయటకి వస్తే మిమ్మల్ని చంపేస్తాను అంటూ భయపెట్టారు. ఈ కార్యక్రమం ఆర్​డీటీ సంస్థ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో నిర్వహించారు. పట్టణంలోని కంటైన్మెంట్ జోన్​లో ప్రజలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కాస్త నిర్లక్ష్యం చేసినా కరోనా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది అని ఆర్​డీటీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

కరోనా వేషధారి ద్వారా అవగాహన

ABOUT THE AUTHOR

...view details